విజయ్ దేవరకొండ కొత్త చిత్రం షురూ
BY Telugu Gateway2 July 2018 10:01 AM GMT

X
Telugu Gateway2 July 2018 10:01 AM GMT
టాలీవుడ్ లో వరస పెట్టి అవకాశాలు దక్కించుకుంటున్నవారిలో విజయదేవరకొండ ఒకరు. ఒక్క సినిమా..ఒకే ఒక్క సినిమా. అర్జున్ రెడ్డి విజయ్ కు అవకాశాలు అలా తెచ్చిపెడుతోంది. ఎందుకంటే టాలీవుడ్ లో అర్జున్ రెడ్డి సృష్టించిన హంగామా అలా ఇలా కాదు. విజయ్ నటన అలా ఉంది ఆ సినిమాలో మరి. ఇప్పుడు వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు ఈ కుర్ర హీరో. ఇప్పటికే విజయ్ నటిస్తున్న ట్యాక్సీవాలా, గోతా గోవింద, నోటాలు ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి.
కొత్తగా మైత్రీ మూవీస్ సంస్థలో ‘డియర్ కామ్రెడ్’ అనే సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ సోమవారం నాడు ప్రారంభమైంది. సంగీత దర్శకుడు కీరవాణి క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా రష్మిక మందాన నటిస్తున్నారు. భరత్ కమ్మ డైరెక్షన్‌లో రాబోతున్న ఈ సినిమాలో విజయ్ విద్యార్థి నాయకుడిగా కన్పించనున్నట్లు టాక్.
Next Story