Telugu Gateway
Telangana

కెటీఆర్ పేరు చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు

కెటీఆర్ పేరు చెప్పి టీఆర్ఎస్ ఎమ్మెల్యే బెదిరింపులు
X

తెలంగాణ ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటీఆర్ పేరు చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే చేసిన బెదిరింపుల వ్యవహారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా దీనికి సంబంధించిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కలెక్టర్ అయినా..ఎవరైనా అధికార పార్టీకి సపోర్ట్ చేస్తారు. కెటీఆర్ డీజీపీకి ఒక్క మాట చెపితే క్యాంప్ లేపేస్తారు. రాకపోతే మీ ఇష్టం అంటూ ఫోన్ లోనే వార్నింగ్ లు ఇఛ్చారు. అదీ కార్పొరేటర్ కుమార్తెకు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌ పర్సన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని భగ్నం చేసే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఈ బెదిరింపులకు దిగినట్లు కన్పిస్తోంది. టీఆర్ఎస్‌కు చెందిన చైర్‌పర్సన్ సునీతారాణికి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ, ఇండిపెండెంట్ తదితర మెజార్టీ కౌన్సిలర్లు ఒక్కటయ్యారు. 34మంది కౌన్సిలర్లకు గాను 29మంది పది రోజులుగా రహస్య క్యాంప్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో అవిశ్వాస నోటీసు ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే చిన్నయ్య చేస్తున్న ప్రయత్నాలు ఫలించ లేదు. మంత్రులు, ఇతర ముఖ్యనేతలు బుజ్జగించినా అసమ్మతి కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. అయితే ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. చేపట్టారు. ఇందులో భాగంగా కౌన్సిలర్‌ కూతురి పట్ల ఎమ్మెల్యే బెదిరింపులకు దిగారు. ‘మీ అమ్మ క్యాంపు నుంచి రాకపోతే మీ భూవివాదాన్ని బయటకు తీస్తా’ అంటూ బెదిరించారు. ప్రభుత్వంలో ఉన్నామని, క్యాంపులో ఉన్నవారు బయటకు రాకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ ఎమ్మెల్యే చిన్నయ్య టీఆర్ఎస్ కౌన్సిలర్ కుమార్తెను హెచ్చరించారు. వీరి సంభాషణలకు సంబంధించిన ఆడియో బయటపడటంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మర్యాదపూర్వకంగా అడుగుతున్నాం అందరిని.

రాకపోతే మేం చేసేది మేం చేస్తాం. గవర్నమెంట్ ఉంది. ఎవరెవరిని ఇబ్బంది పెట్టాలో పెట్టి అయినా...నష్టం చేసి అయినా తీసుకొస్తాం. కెటీఆర్ తలచుకున్నాక ఏముంటదమ్మా?. ప్రభుత్వమే భూమి కబ్జాలు చేస్తదట. కమిషనర్ ను పంపి బోర్డు పంపిస్తాం. మాట వినకపోతే బదిలీ చేస్తాం. కెటీఆర్ కు చెపితే పని అయిపోతుంది. ఫ్యామిలీని ఇక్కడ పెట్టుకుని అక్కడ ఉద్యోగం ఎలా చేస్తాడు’ అంటూ బెదిరింపులకు దిగాడు.

https://www.youtube.com/watch?v=zUlkbN-HZN4

Next Story
Share it