‘సైరా’ స్టిల్స్ లీక్
BY Telugu Gateway29 July 2018 8:19 AM GMT

X
Telugu Gateway29 July 2018 8:19 AM GMT
ఈ మధ్యే ‘అరవింద సమేత రాఘవ’ సినిమాకు సంబంధించిన స్టిల్స్ లీక్ అయ్యాయి. పెద్ద పెద్ద సినిమాలు అన్నింటిని ఈ సమస్య వేధిస్తోంది. ఇప్పుడు మెగా స్టార్ చిరంజీవి సినిమా ‘సైరా’ నరసింహరెడ్డి కి ఇదే సమస్య ఎదురైంది. ఈ సినిమాకు సంబంధించిన రెండు స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబచ్చన్ వంటి స్టార్స్ కూడా నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇటీవల సినిమా లోకేషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. తాజాగా యుద్ధ సన్నివేశాలకు సంబంధించి ఫొటోలు నెట్‌లో సర్క్యూలేట్ అవుతున్నాయి. ఈ ఫొటోలలో నటీనటులు కనిపించకపోయినా.. ఓ భారీ కోట తగలబడుతున్న స్టిల్‌తో పాటు కొందరు బ్రిటీష్ సైనికుల దుస్తుల్లో ఉన్న స్టిల్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది.
Next Story