Telugu Gateway
Andhra Pradesh

సోనియా ‘లెక్కల్లో వీక్’

సోనియా ‘లెక్కల్లో వీక్’
X

మోడీ సర్కారుపై తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాసంపై మాటల తూటాలు పేలుతున్నాయి. మాకు సంఖ్యాబలం లేదని ఎందుకు అనుకుంటున్నారు..ఈ అవిశ్వాసం ద్వారా మోడీ సర్కారును పడగొడతాం అనే స్థాయిలో సోనియాగాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసేందే. అయితే దీనిపై బిజెపి నేతలు కూడా అంతే ఘాటుగా స్పందించారు. సంఖ్యాపరంగా చూస్తే బిజెపి సొంతంగానే ఎంతో మెరుగైన పరిస్థితిలో ఉంది. మిత్రపక్షాలను కూడా కలుపుకుంటే పరిస్థితి మరింత కూల్.

అందుకే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంతకుమార్ సోనియాపై వ్యంగాస్త్రాలు సంధించారు. లెక్కల్లో సోనియా చాలా పూర్ అనుకుంటా..అందుకే ఆమె అలా మాట్లాడారు అంటూ ఎదురుదాడి చేశారు అనంతకుమార్. తాము అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంటామని..ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రశ్నలు అన్నింటికి సమాధానం చెబుతామని అన్నారు. ఎన్డీయే భాగస్వామ్యపక్షాలు అన్నీ కూడా బిజెపికి అనుకూలంగానే ఉన్నాయి. దీంతో అవిశ్వాసాన్ని ఎదుర్కోవటం బిజెపికి పెద్ద సమస్యగా మారే అవకాశం లేదు.

Next Story
Share it