Telugu Gateway
Top Stories

సింధుకు మరో ఓటమి

సింధుకు మరో ఓటమి
X

పీ వీ సింధుకు ‘ఫైనల్ గండం’ వీడటం లేదు. ఫైనల్స్ వరకూ రావటం అక్కడ పరాజయం పాలవటం సింధుకు మామూలై పోయింది. థాయ్ లాండ్ బ్యాడ్మింటన్ ఓపెన్ సీరిస్ ఫైనల్లో పాత కథే పునరావృతం అయింది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండా జపాన్ క్రీడాకారిణి సజోమీ ఒకుహర చేతిలో సింధు పరాజయం పాలైంది. తెలుగు తేజం సింధు ఒకుహర చేతిలో 21-15, 21-18 తేడాతో వరస గేముల్లో ఓటమి చవిచూసింది. ఈ గేమ్ లో సింధు ఏ దశలోనూ థాటిగా ఆడలేకపోయింది. గత ట్రాక్ రికార్డును చూసినా సింధుపై ఒకుహరా దే ఆధిక్యత. వీరిద్దరూ మొత్తం పదకొండు సార్లు గేమ్ ఆడగా...అందులో ఒకుహర ఆరు సార్లు గెలిచింది.

Next Story
Share it