Telugu Gateway
Cinema

‘డి-కంపెనీ’... వర్మ కొత్త ప్రకటన

‘డి-కంపెనీ’... వర్మ కొత్త ప్రకటన
X

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన చరిత్రతో రామ్ గోపాల్ వర్మ కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించారు. వర్మ చేసినా తాజా సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈసారి వెబ్ సిరీస్ కే పరిమితం కానున్నారు. ఈ వెబ్ సిరీస్ ను డి-కంపెనీ పేరుతోనే తెరకెక్కించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించానని..మరి కొంత సేకరించే పనిలో ఉన్నట్లు పేర్కొన్నారు.

వర్మ ట్విట్టర్ ద్వారా ఈ విషయాలు అన్నీ షేర్ చేశారు. మొత్తం ఐదు భాగాలుగా ఉండే వెబ్ సిరీస్ బాలీవుడ్ నిర్మాత మధు మంతెనతో కలసి చేయనున్నట్లు తెలిపారు. ఈ సిరీస్ లో 1980ల్లో జరిగిన అల్లర్లు..అందులో దావూద్ పాత్ర వంటి అంశాలు కూడా ఉండబోతున్నాయి. మరి ఈ వెబ్ సిరీస్ ఎంత సంచలనం సృష్టిస్తుందో వేచిచూడాల్సిందే. ఈ మధ్యే పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో గాడ్..సెక్స్ అండ్ ట్రూత్ (జీఎస్టీ) పేరుతో ఓ వెబ్ ఫిల్మ్ తీసి పెద్ద వివాదం సృష్టించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it