Telugu Gateway
Cinema

మహేష్ బాబుతో మరోసారి!

మహేష్ బాబుతో మరోసారి!
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించాలని ఏ హీరోయిన్ కోరుకోదు. రకుల్ ప్రీత్ సింగ్ అయితే ఈ విషయాన్ని పలుమార్లు బహిరంగంగానే ప్రకటించింది. తనకు మహేష్ తో కలసి నటించే ఛాన్స్ వస్తే వేరే సినిమా తేదీలు అయినా సర్దుబాటు చేసుకుంటానని ప్రకటించేది ఈ భామ. అనుకున్నట్లే ఛాన్స్ వచ్చింది ‘స్పైడర్’ సినిమాలో. అదీ మురుగదాస్ దర్శకత్వంలో. కాకపోతే ఈ సినిమా కాస్తా బాక్సాఫీస్ వద్ద భారీ అపజయాన్ని మూటకట్టుకుంది. దీంతో ఎంతో ఆశగా మహేష్ బాబుతో చేసిన తొలి సినిమా ఫట్ మనటంతో రకుల్ కు నిరాశే మిగిలింది.

అయితే ఇప్పుడు రకుల్ కు మహేష్ తో కలసి చేసేందుకు మరో ఛాన్స్ వచ్చిందని టాలీవుడ్ టాక్. ప్రస్తుతం మహేష్ బాబుకు చెందిన 25వ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఓవైపు 25వ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తదుపరి చేయబోయే సినిమాను కూడా సిద్ధం చేస్తున్నాడు మహేష్ బాబు. ఇది సుకుమార్ దర్శకత్వంలో ఉండనుంది. మహేష్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే ఈ కొత్త సినిమా ప్రారంభం కానుందని సమాచారం.

Next Story
Share it