‘లవర్’ ట్రైలర్ వచ్చేసింది
రాజ్ తరుణ్. ఈ మధ్య సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న యువ హీరో. ఇప్పుడు కొత్తగా ‘లవర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో రాజ్ తరుణ్ కు జోడీగా కొత్త అమ్మాయి రిథి కుమార్ హీరోయిన్ గా చేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ శనివారం నాడు విడుదల చేసింది. ట్రైలర్ లో రాజ్ తరుణ్, హీరోయిన్ రిథికుమార్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. లొకేషన్స్ కూడా రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్ రిథి కుమార్ ఓ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుంటే...అదే ఆస్పత్రిలో చేరిన రాజ్ తరుణ్ ‘సిస్టర్’ను సిస్టర్ అని పిలవకుండా..డాక్టర్..డాక్టర్ అంటూ సరదగా ఆటపటిస్తుంటాడు.
అందరికీ సిస్టర్..నాకు మాత్రం డాక్టర్ అంటూ ఓ డైలాగ్ చెబుతాడు. ‘మనం ఈ లోకంలో లేకపోయినా మనల్ని ఎవరైనా తలచుకున్నారంటే..మన జీవితానికి అర్థం వచ్చినట్లే అని రిథి కుమార్ చెపితే..ఏముంది చనిపోయే ముందు ఎవరి దగ్గరైనా నాలుగు లక్షల రూపాయలు అప్పు చేసి పోతే..చాలా జీవితాంతం తలుచుకుంటూనే ఉంటారు అని చెప్పటం నవ్విస్తుంది. దిల్ రాజు నిర్మాణ సంస్థ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది.
https://www.youtube.com/watch?v=yDfZGykEhMY