పాయల్ రాజ్ పుత్ కు ఛాన్స్ లే ఛాన్స్ లు !
BY Telugu Gateway25 July 2018 3:55 PM IST

X
Telugu Gateway25 July 2018 3:55 PM IST
ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ సినిమాలో తన బోల్డ్ నటనతో విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది ఈ కుర్ర హీరోయిన్. ఓ వైపు అందాలు ఆరబోయటంతో పాటు..మరో వైపు నటనతోనూ ఆకట్టుకుంది. దీంతో ఈ అమ్మడికి టాలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయని టాక్. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్ తో ఓ సినిమా ఛాన్స్ ఆమె పరమైనట్లు సమాచారం.
దీంతోపాటు మరికొంత మంది నిర్మాతలు కూడా పాయల్ డేట్స్ కోసం ట్రై చేసినట్లు టాక్. ఒక్క సినిమా హిట్ కొడితే చాలు..ఆ హీరో వెంట..హీరోయిన్ల వెంట పరిశ్రమ అంతా వెంటపడటం సహజమే. ఇఫ్పుడు పాయల్ రాజ్ పుత్ విషయంలోనూ అదే జరుగుతోంది. ఓ సినిమాలో కన్నుగీటడం ద్వారా మళయాళ కుర్ర హీరోయిన్ ప్రియా వారియర్ కు కూడా అలా వరస పెట్టి సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే.
Next Story



