పవన్ పది మంది ఎంపీలుంటే ..అసెంబ్లీ ఆపేస్తారట..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీడియో సాక్షిగా అడ్డంగా బుక్కయ్యారు. విజయవాడలో జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆ వీడియో క్లిప్ కూడా వాట్సప్ ల్లో జోరుగా సర్కులేట్ అవుతోంది. తనకు పది మంది ఎంపీలు ఉంటే అసెంబ్లీని ఆపేసేవాడినని, ఆపేసేవాడిని అని పవన్ రెండుసార్లు చాలా ఆవేశంగా వ్యాఖ్యలు చేస్తే..అందులో కార్యకర్తలు సహజంగానే కేకలు వేస్తున్నారు. అసలు ఎంపీలు లోక్ సభ, రాజ్యసభల్లో ఉంటారు..ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాత్రమే ఉంటారు అనే విషయాన్నివదిలేసి..పవన్ ఇలా మాట్లాడటం ప్రత్యర్దులకు పవన్ మరో అస్త్రాన్ని అందించినట్లు అయింది.
కొద్ది రోజుల క్రితమే విశాఖపట్నంలో నారా లోకేష్ చేసిన స్కామ్..ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కు భూ కేటాయింపుల విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. పవన్ పొరపాటున ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంస్థను వ్యక్తిగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోను టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో వైరల్ చేయటమే కాకుండా...ఆయనపై వెటకారపు వ్యాఖ్యలు కూడా చేశాయి. తాజా వ్యాఖ్యల ద్వారా పవన్ టీడీపీకి మరో అస్త్రాన్ని అందించినట్లు అయింది.
https://www.youtube.com/watch?v=iaY72DEVUio