Telugu Gateway
Andhra Pradesh

పవన్ సంచలన వ్యాఖ్యలు

పవన్ సంచలన వ్యాఖ్యలు
X

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు సభలో టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీని తిట్టి..అదే సభలో ఆయన కాళ్ళు మొక్కటం పోరాటం అవుతుందా?. అని ప్రశ్నాంచారు. మరో వైపు కేంద్ర హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ సభలోనే చంద్రబాబు ఎప్పటికీ మా మిత్రుడే అని ప్రకటించారు కదా?. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి. బిజెపితో మీరు చేసేది ధర్మపోరాటం అని మేం ఎలా నమ్మాలి? అని ప్రశ్నించారు. రేపు మళ్లీ మీ అవసరాల కోసం.. బిజెపిపై మీ వైఖరి మార్చుకోరన్న గ్యారెంటీ ఏంటీ?.. అని నిలదీశారు. బిజేపీ నష్టం కలగకూడదనే.. పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు శుక్రవారం నాటి ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. మీకు ఇదే నా సమాధానం అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే జనసేనకు వచ్చే లాభమేంటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు.

అలాంటి పార్టీతో పొత్తు ఎవరైనా పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? అసలు నా ట్వీట్ల ఉద్దేశం ఏంటంటే... బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని అంతేదారుణంగా దెబ్బకొట్టిందని. ప్రజలను మోసం చేశారు. వంచించారు.. ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి. గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియంది కాదు. తద్వారా ఏపీ ప్రజలను నిలకడలేని వాళ్లుగా.. అవకాశవాదులుగా.. ఆత్మగౌరవం లేనివాళ్లుగా దేశస్థాయిలో నిలబెట్టారు’ అని పవన్‌ విమర్శించారు.

Next Story
Share it