నేపాల్ కు వెళ్లనున్న శర్వా..సాయిపల్లవి
BY Telugu Gateway14 July 2018 4:15 AM GMT
X
Telugu Gateway14 July 2018 4:15 AM GMT
టాలీవుడ్ లో వరస హిట్లు అందుకుంటున్న హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. శర్వానంద్, సాయిపల్లవి కాంబినేషన్ లో ‘పడి పడి లేచే మనసు’ సినిమా శరవేగంగా షూటింగ్ సాగుతోంది. కోల్ కత్తాలో ఈ సినిమా డెబ్బయి రోజుల షెడ్యూల్ పూర్తి చేసుకుంది.త్వరలోనే తదుపరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ నేపాల్ వెళ్లనుంది. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. కోల్ కతా షెడ్యూల్ గురించి నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ముఖ్య తారాగణంపై కలకత్తాలో కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. డైరెక్టర్ హను మరో మంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి జంట చూడముచ్చటగా ఉంటుందని తెలిపారు.
Next Story