Telugu Gateway
Telangana

నాకేమీ వద్దు...టీఆర్ఎస్ ఓటమి చాలు

నాకేమీ వద్దు...టీఆర్ఎస్ ఓటమి చాలు
X

ఇది మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట. నల్లగొండ జిల్లా నేతలు అందరూ మూకుమ్మడిగా ‘టార్గెట్ టీఆర్ఎస్’గా సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ను ఎప్పుడెప్పుడు ఓడించాలా? అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. నల్లగొండ పార్లమెంటరీ పార్టీ సమీక్షా సమావేశంలో ఉత్తమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలన ఉత్తమ్ కోరారు. కోమటిరెడ్డి అయితే ‘నాకు మంత్రి పదవి వద్దు.. ముఖ్యమంత్రి పదవి వద్దు.. కేసీఆర్‌ను గద్దె దింపడమే ధ్యేయంగా పనిచేస్తానని’ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం నలుగురి చేతిలో నలిగిపోతుందని కోమటిరెడ్డి అన్నారు. అంతేకాక వారి చేతిలో నుంచి ఈ రాష్ట్రాన్ని బయటపడేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

ఎస్‌ఎల్బీసీ సొరంగం పూర్తి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు విదేశాల నుంచి విమానాలలో మిషనరీ తెస్తున్నారు.. కానీ నల్గొండలోని ఎస్‌ఎల్బీసీ సొరంగం పనులకు, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయడం లేదని కోమటిరెడ్డి పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రి జగదీశ్‌ రెడ్డిపై కోమటిరెడ్డి తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు. మంత్రి జగదీశ్‌ రెడ్డికి టికెట్‌ రాదని.. ఒకవేళ టికెట్‌ వచ్చినా డిపాజిట్‌ కూడా దక్కదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రెండు పార్లమెంట్‌, 12 అసెంబ్లీ సీట్లను గెలిపించి కాంగ్రెస్‌ పార్టీ సినీయర్‌ నాయకురాలు సోనియాగాంధీకి అంకితం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాత ప్రాజెక్టులు పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరు వస్తుందని, కొత్త ప్రాజెక్టులు కడితే కమిషన్‌లు వస్తాయని, పాత ప్రాజెక్టులు పూర్తి చేయడంలేదని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి విమర్శించారు.

Next Story
Share it