Telugu Gateway
Andhra Pradesh

అమరావతిలో ‘మైస్ హబ్’ పేరుతో ‘చంద్రబాబు ‘నైస్ దోపిడీ’!

అమరావతిలో ‘మైస్ హబ్’ పేరుతో ‘చంద్రబాబు ‘నైస్ దోపిడీ’!
X

రాజధాని కోసం రైతులిచ్చిన భూమి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ‘నైస్’ దోపిడీకి ఓ కల్పతరువుగా మారిపోయింది. ఇఫ్పటికే స్విస్ ఛాలెంజ్ పేరుతో సింగపూర్ సంస్థలకు..ఇతర ప్రైవేట్ సంస్థలకు రాజధానిలో భూములు ఇఛ్చేసిన చంద్రబాబు ఇప్పుడు కొత్తగా ‘మైస్ హబ్’ పేరుతో కొత్త దోపిడీకి తెరతీశారు. మైస్ అంటే..మీటింగ్స్, ఇన్సెంటివ్స్, కాన్ఫరెన్సెస్, ఈవెంట్స్ (ఎంఐసీఈ). దీని కింద ఓ మెగా కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్, 5 స్టార్ హోటల్ నిర్మించాల్సి ఉంటుంది. ఇక్కడే చంద్రబాబు సర్కారు పక్కాగా దోపిడీకి స్కెచ్ వేసింది. దీని కోసం మొత్తం మొత్తం 42 ఎకరాలు కేటాయించింది. అయితే ఇందులో 20 ఎకరాల భూమిని 66 సంవత్సరాల పాటు లీజుకు ఇస్తారు. అది కూడా నామమాత్రంగానే ఉంటుంది. అప్ ప్రంట్ కింద ఎలాంటి చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జరిగే వ్యాపారంలో వచ్చే సింహభాగం ప్రైవేట్ సంస్థలకు వెళుతుంది. సర్కారుకు నామమాత్రంగా దక్కుతుంది. ప్రాజెక్టు కేటాయించిన వారికి మాత్రం భారీ ‘లాభం’ ఉంటుంది. ఎవరైతే ఈ ప్రాజెక్టు దక్కించుకుంటారో ఆ సంస్థకు ప్రాజెక్టు లో లాభదాయకత ఉండేందుకు అని 20 ఎకరాలపై సర్వ హక్కులు కల్పిస్తారంట. ఈ 20 ఎకరాల భూమిలో ఆ సంస్థ వాణిజ్య సముదాయాలతోపాటు..రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేసుకోవచ్చు.

ప్రభుత్వ, ప్రైవేట్, భాగస్వామ్య (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ ప్రాజెక్టు ను డిజైన్, ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ ఫర్ (డీఎఫ్ బివోటి) మార్గం కింద చేపట్టాల్సి ఉంటుంది. పైగా ఈ ప్రాజెక్టు దక్కించుకున్న సంస్థకు పర్యాటక శాఖ విధానం ప్రకారం రాయితీలు కూడా కల్పిస్తారు. మెగా కన్వెన్షన్ సెంటర్ ను 6000 సీట్ల సామర్ద్యంతో అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం 1220 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. తొలి దశ ప్రాజెక్టు వ్యయం 535 కోట్ల రూపాయలుగా పేర్కొన్నారు. ప్రాజెక్టు వ్యయం దగ్గర నుంచి సక్సెస్ ఫుల్ బిడ్డర్ కు 20 ఎకరాల భూమిని కేటాయించటం పెద్ద స్కామ్ గా మారే అవకాశం ఉందని మునిసిపల్ శాఖ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ‘స్కామ్ లు’ ఎన్నో అమరావతి కేంద్రంగా సాగుతున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it