Telugu Gateway
Cinema

అరవింద సమేత ‘స్టిల్ లీక్’

అరవింద సమేత ‘స్టిల్ లీక్’
X

ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పెద్ద హీరోలకు సంబంధించిన సినిమాల స్టిల్స్ లీక్ అవుతూనే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ‘భరత్ అనే నేను’ సినిమా స్టిల్ లీక్ అయి సోషల్ మీడియాలో పెద్ద సంచలనం సృష్టించింది. చివరకు దర్శకుడు కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా స్టిల్స్ సర్కులేట్ చేయవద్దని వేడుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న అరవింద సమేత సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ స్టిల్ ఒకటి అలాగే హల్ చల్ చేస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఏదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈ ఫోటోను భారీ ఎత్తున సర్కులేట్ చేస్తున్నారు. సినిమాలో భావోద్వేగపు సీన్ అంటూ దీనికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా.. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్‌ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం.చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు.

Next Story
Share it