Telugu Gateway
Cinema

కాలేజీ కుర్రాడుగా ఎన్టీఆర్

కాలేజీ కుర్రాడుగా ఎన్టీఆర్
X

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘అరవింద సమేత రాఘవ’ సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ మొదలైంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వస్తున్న తొలి సినిమా ఇదే. ఎన్టీఆర్ తాజా సినిమా జైలవకుశ బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు రాబట్టగా..త్రివిక్రమ్ తాజా సినిమా అజ్ణాతవాసి బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. దర్శకుడు తాజా ఫ్లాప్ తో ఉంటే..హీరో మాత్రం హిట్ లో ఉన్నారు. అందులో వీరిద్దరి కాంబినేషన్ లో మొదటి సినిమా కావటంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. కొత్త సినిమాకు రెడీ అయ్యేందుకు వీలుగా ఎన్టీఆర్ గ్యాప్ లేకుండా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. వరస పెట్టి షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటున్నారు.

తాజా షెడ్యూల్ లో ఎన్టీఆర్ కాలేజీ కుర్రాడి పాత్రలో నటించనున్నారు. దీంతో పాటు ఈ షెడ్యూల్ లో అన్నీ సరదా సన్నివేశాలే ఉన్నాయట. ఆగస్ట్‌ మూడు వరకు జరిగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌ సీన్స్‌ కాకుండా ఓన్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌ మీద దృష్టి పెట్టనున్నారు. ఈ సినిమా మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ కూడా పూర్తయ్యాయి. ఈ షెడ్యూల్‌ తర్వాత పాటల కోసం చిత్ర యూనిట్ పొల్లాచ్చి వెళ్లనుంది. ఈ చిత్రంలో జగపతిబాబు, నాగబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్‌ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమచారాం మాత్రం ఏమీలేదు. తమన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయాలని యోచిస్తున్నారు.

Next Story
Share it