Top
Telugu Gateway

ఈ ప్రభుత్వం పడిపోతుంది..జోగిని శ్యామల

ఈ ప్రభుత్వం పడిపోతుంది..జోగిని శ్యామల
X

ఉజ్జయిని అమ్మవారి బోనాల సందర్భంగా వివాదం చోటుచేసుకుంది. జోగిని శ్యామల పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు లేవని.. ఒక్కో మహిళ పది కిలోల బరువు ఎత్తుకుని లైన్లో నిలబడితే వారిని వదిలేసి..ఎంతసేపు వీఐపీల సేవలో తరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం పడిపోతుందని శ్యామల శపించారు. ప్రభుత్వం ఏర్పాట్లు గొప్పగా చేశామని ప్రచారం చేసుకుంటుంది కానీ..వాస్తవంలో మాత్రం అది ఏమీలేదన్నారు.

తెలంగాణ ఆడపడుచుని ఈ ప్రభుత్వం అవమానించిందని శ్యామల వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఐదేళ్ళు..పదేళ్లు ఉండొచ్చని..కానీ తాను ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నానని వ్యాఖ్యానించారు. బోనాలు ఉత్సవంలో పోలీసుల అత్యుత్సహం ప్రదర్శించారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఉజ్జయిని మహంకాళి డ్యూటీలో ఉన్న ఓ చానెల్‌ రిపోర్టర్‌పై పోలీసు అధికారి చేయి చేసుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై మీడియా పాయింట్ వద్ద రిపోర్టర్లు, కెమెరామెన్‌లు నిరసన వ్యక్తం చేశారు.

Next Story
Share it