Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు77..బాబుకు 33..ఫైటింగ్ 65 సీట్లకే!

జగన్ కు77..బాబుకు 33..ఫైటింగ్ 65 సీట్లకే!
X

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఫలితాలు ఎలా ఉంటాయి?. ప్రతి రాజకీయ పార్టీ ‘లెక్కలు’ వేసుకునే పనిలో ఉంది. పనిలో పనిగా పలు పార్టీలు సర్వేల రూపంలో కూడా సమాచారం తెప్పించుకుంటున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో పరిస్థితులు ఎలా ఉంటాయి అన్న అంశంపై ఓ సంస్థ సర్వే నిర్వహించగా...వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 77 సీట్లు, టీడీపీకి 33 సీట్లు రావటం పక్కా అని తేలింది. అంటే ఈ లెక్కన 110 సీట్ల లెక్క తేలిపోయింది. అయితే ఇక మిగిలింది తేల్చుకోవాల్సింది మాత్రం 65 సీట్లలోనే. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ 65 సీట్లలో పోటీ తీవ్రంగా ఉండటం, పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన ప్రభావం ఎక్కువగా ఉండే ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే మార్పులు వంటి అంశాలపై మిగిలిన ప్రాంతాల్లో ఫలితాన్ని నిర్దేశించనున్నాయని తేలింది.

ఈ 65 సీట్లలో ఫలితాన్ని నిర్దేశించింది ఐదు వేల ఓట్లు మాత్రమే. అందుకే అంచనా వేయటం క్లిష్టంగా మారింది. జనసేన అభ్యర్ధులు ఎవరి ఓట్లను చీలుస్తారు..ఎవరిని ఒడ్డున పడేస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టినట్లు తేల్చేశారు. అయితే ఈ మధ్యే ఎంపీ పదవులకు రాజీనామా చేసిన నేతలు. ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు జనసేనతో పొత్తు ఉంటే..అలవోకగా గెలవొచ్చని భావిస్తున్నారు. అయితే అంతిమ నిర్ణయం జగన్ దే కాబట్టి..వీరి కోరిక నెరవేరే అవకాశం లేదని చెప్పుకోవచ్చు.

అయితే ప్రస్తుత పరిస్థితుల ప్రకారం వైసీపీ 77 సీట్లతో ముందు వరసలో ఉన్నందున కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు తధ్యం అని..అయితే ఎలక్షన్ మేనేజ్ మెంట్ లో దిట్ట అయిన చంద్రబాబును కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదని కొంత మంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ, జనసేన పొత్తు ఉంటే...ఏపీలో టీడీపీ అడ్రస్ గల్లంతు అవటం ఖాయం అని వైసీపీకి చెందని కీలక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఆ ఛాన్స్ లేకపోవటంతో సొంతంగానే గెలవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. అయితే అధికార టీడీపీతో పోల్చుకుంటే...తమకు ‘ఆర్థిక’పరమైన కష్టాలు కూడా చాలా ఉంటాయని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

Next Story
Share it