Telugu Gateway
Andhra Pradesh

ఐఏఎస్ లూ చంద్రబాబు ‘ప్రచారం చేయాలా?’!

ఐఏఎస్ లూ చంద్రబాబు ‘ప్రచారం చేయాలా?’!
X

ప్రభుత్వ ఉన్నతాధికారుల బాధ్యత ఏంటి?. ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు సరిగా అమలు జరిగేలా చూడటం. ఎప్పుడైనా అవసరాన్ని బట్టి క్షేత్రస్థాయిలో పరిశీలించి తగు సలహాలు..సూచనలు ఇవ్వటం. కలెక్టర్లు అయితే జిల్లాల్లో ఉంటారు కాబట్టి వారు ఆయా ప్రాంతాల్లో జరిగే పనులను పరిశీలిస్తుంటారు. ఇది కూడా అరుదుగానే జరుగుతుంది అని చెప్పాలి. కానీ సచివాలయంలో,అమరావతిలో ఉండే శాఖాధిపతులు బయటి ప్రాంతాలకు వెళ్ళేది చాలా తక్కువే. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం తెలుగుదేశం పార్టీ ప్రచారం కోసం చూస్తుంటే ఐఏఎస్ లను కూడా వాడేసేలా ఉన్నారు. ఆయనే స్వయంగా కలెక్టర్లు..శాఖాధిపతులు ప్రజల్లోకి వెళ్ళి ..ఏమి చేశామో చెప్పాలని ఆదేశించారు. గ్రామ దర్శి కార్యక్రమంలో భాగంగా ఈ పనులు చేయాలని...వారంలో రెండు రోజులు అక్కడే ఉండి..ఎన్ని కష్టాలు ఉన్నా ఎలా అభివృద్ధి చేశామో చెప్పాలని ఆదేశించారు.

ఇది నిజంగా అధికారుల పని కాదు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం అమలు బాధ్యతను వీళ్లు పర్యవేక్షిస్తారు కానీ..వాళ్ళు ప్రభుత్వం తరపునో..తెలుగుదేశం పార్టీ తరపునో ప్రచారం చేయరు. రాష్ట్రంలో...జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో చెప్పుకునే బాధ్యత ఆయా జిల్లాల మంత్రులు..ఎమ్మెల్యేలది. అధికార పార్టీది. కానీ సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే అధికారులను ప్రజల్లోకి వెళ్లి..ప్రభుత్వం తరపున ఏమోమి చేశామో చెప్పండి అని ఆదేశించటంపై కొంత మంది అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. సీఎ చంద్రబాబు తీరు చూస్తుంటే...వచ్చే ఎన్నికల్లో తమను టీడీపీ తరపున ప్రచారం చేయాలని కోరేలా ఉన్నారని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

గతంలో ఎన్నడూలేని రీతిలో ఈసారి చంద్రబాబు సర్కారు పలు విషయాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ఆయా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన అంశాలపై కూడా చంద్రబాబు అడ్డగోలుగా కేబినెట్ లో పెట్టి ఓకే చేసేసుకుంటున్నారు. అధికారుల అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకోకుండా తాను అనుకున్న విధంగా చేసుకుంటూ ‘స్కామ్ ’లకు కేబినెట్ ను ఓ కేంద్రంగా మార్చారు. ప్రభుత్వంలోని కొంత మంది ఉన్నతాధికారులు మాత్రం ప్రభుత్వం చేసే స్కాంలకు తమ వంతు పూర్తి సహకారం అందించటమే కాకుండా..ఎలా చేసుకోవచ్చో గైడ్ కూడా చేస్తున్నారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. సీఎం చంద్రబాబు తాజా సూచనపై అధికారులు ఎలా వ్యవహరిస్తారో వేచిచూడాల్సిందే.

Next Story
Share it