Telugu Gateway
Andhra Pradesh

టీటీడీకి హైకోర్టు నోటీసులు

టీటీడీకి హైకోర్టు నోటీసులు
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో జరిగిన అవకతవకల వ్యవహారం హైకోర్టుకు కెక్కింది. టీటీడీకి చెందిన నగల మాయం, పోటులో తవ్వకాలు తదితర అంశాలపై నిజాలు నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గుజరాత్ కు చెందిన భూపేందర్ స్వామి, గుంటూరు జిల్లాకు చెందిన అనిల్ కుమార్ లు ఇద్దరూ ఈ పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ పిల్ లు విచారణకు స్వీకరించిన హైకోర్టు టీటీడీ ఈవోకు, దేవాదాయ శాఖకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లోగా ఈ వివాదాలకు సంబంధించిన అన్ని అంశాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

ఇటీవలే టీటీడీ బోర్డు నుంచి వేటు ఎదుర్కొన్న మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తీవ్రమైన ఆరోపణలుచేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. టీటీడీ నిధులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వ అవసరాలకు వాడటంతో పాటు...అదృశ్య శక్తుల జోక్యంతో టీటీడీలో అంతా ఇష్టారాజ్యం గుతోందని విమర్శించారు.

Next Story
Share it