విజయ్ దేవరకొండ గీత గోవిందం ‘రికార్డు’
BY Telugu Gateway24 July 2018 2:08 PM IST
X
Telugu Gateway24 July 2018 2:08 PM IST
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా గీత గోవిందం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తొమ్మిది గంటల్లోనే ఈ సినిమాకు సంబంధించి 20 లక్షల వ్యూస్ వచ్చాయి. సోమవారం నాడు ఈ సినిమా టీజర్ విడుదల అయింది. ఈ సినిమాపై ఇఫ్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. టీజర్ కు వచ్చిన స్పందనపై విజయ్ దేవరకొండ హర్షం వ్యక్తం చేశారు. అంతే కాదు..‘ప్రజలారా..నా మార్పు గురించి ఇంతగా ఎదురుచూస్తున్నారా..హే భగవాన్’ అంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఈ టీజర్ లో ఎన్నో సరదా..చిలిపి సన్నివేశాలు ఉన్నాయి. ఈ సినిమా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆగస్టు 15న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Next Story