‘గీత గోవిందం’ పాట అదిరింది

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న సినిమా ‘గీతా గోవిందం’. ఈ సినిమా యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతోనే హైప్ పెంచేస్తోంది. అందులో అర్జున్ రెడ్డి సినిమాతో సూపర్ సక్సెస్ తో ఉన్న హీరో విజయ్, రష్మిక నటించిన ఛలో సినిమా కూడా టాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది. ఇద్దరిదీ ప్రస్తుతం హిట్ బాటే. త్వరలో విడుదల కానున్న గీతా గోవిందం సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి.
ఇప్పటికే ఫస్ట్ లుక్, పోస్టర్లతో ముఖ్యంగా యూత్ ను ఆకట్టుకున్న చిత్రయూనిట్ మంగళ వారం తొలి పాటను రిలీజ్ చేశారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే క్లాసికల్ మెలోడియస్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అనంత శ్రీరామ్ సాహిత్యమందించిన ఈ పాటను సిద్ధి శ్రీరామ్ ఆలపించారు. పరుశురామ్ దర‍్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్నారు ఈ సినిమాను.
https://www.youtube.com/watch?v=rQA5YM9UDrg