Telugu Gateway
Andhra Pradesh

పరువు తీసుకుంటున్న చంద్రబాబు సర్కారు

పరువు తీసుకుంటున్న చంద్రబాబు సర్కారు
X

చంద్రబాబు సర్కారు తన పరువు తానే తీసుకుంటుంది. రాజకీయంగా ఏపీలో ఒంటరి అయిపోయిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలుపు భయం వెంటాడుతుంటుండటంతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు చూసి టీడీపీ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. అసలు పాలన ఇలాగేనా?. నలభై సంవత్సరాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు చేయాల్సిన పని ఇదేనా?. అంటూ నిట్టూర్పులు విడుస్తున్నారు. అసలు గతంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో నిత్యం దీక్షలు చేస్తూ ఇది ‘దీక్షల ప్రభుత్వం’గా మారింది అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉండి ఎవరైనా దీక్షలు చేశారంటే ఆ పని తమకు చేతకాలేదని అంగీకరించినట్లే. తమ ఫెయిల్యూర్ ను ఒప్పుకుని..పోరాటాన్ని ఎంచుకున్నట్లే. నాలుగేళ్లు బిజెపి ప్రభుత్వంతో కలసి ఉండి..ఇప్పుడు మోసం చేశారని అంటే ఎవరైనా నమ్ముతారా?. చంద్రబాబు సర్కారు పరువు తీసుకునే పనుల్లో మచ్చుకు కొన్ని?.

  1. మెట్ట పొలంలో ‘వరి వృక్షాలకు’ నాట్లు వేసిన ఘనుడిగా చరిత్రలో నిలిచిపోయిన సీఎం చంద్రబాబు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
  2. టీడీపీ ప్రభుత్వం రాక ముందు రైతులు సాగు చేసుకోలేదా?. పంటలు పండించలేదా?. ఏరువాక పేరు చెప్పి పత్రికలకు పేజీలకు పేజీలు యాడ్స్ ఇచ్చి..మళ్లీ ఫోటోలకు రైతులాగా పొజిచ్చి ప్రచారం చేసుకోవటం అవసరమా?.
  3. సీఎం రమేష్ ఉక్కు దీక్షలో పొట్టి శ్రీరాములు ‘హామీ వచ్చాక’ దీక్ష విరమించారని చెప్పి చంద్రబాబు నవ్వుల పాలు అవ్వటం. అమరణ నిరహార దీక్షలో పొట్టి శ్రీరాములు చనిపోయాక జరిగిన ఆందోళనల తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రకటన జరిగింది.

4.అదే సీఎం రమేష్ దీక్షలో విభజన చట్టంలోనే ఆరు నెలల్లో కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని స్పష్టంగా ఉందని మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. మరి అంత స్పష్టంగా ఉంటే..నాలుగేళ్లు కేంద్ర మంత్రివర్గంలో ఉండి..ఒక్క ప్రత్యేక మీటింగ్ కూడా ఎందుకు పెట్టించలేకపోయారు?. ఆ ఫెయిల్యూర్ ను బహిరంగంగా అంగీకరించినట్లే కదా?.

  1. ఓ వ్యక్తి 11 రోజులు ఏమీ తినకుండా దీక్ష చేయటం అసలు సాధ్యమేనా?. సీఎం రమేష్, బీ టెక్ రవి దీక్షల్లో అంత వ్యత్యాసం ఎందుకు?. ఇద్దరూ ఒకే రోజు దీక్ష ప్రారంభిస్తే మధ్యలోనే బీటెక్ రవిని ఆస్పత్రికి ఎలా తరలిస్తారు?.
  2. దీక్షలు చేసేవాళ్లు సీఎం చంద్రబాబు వచ్చేవరకూ సీఎం రమేష్ లాగా ఎన్ని రోజులు అయినా అలా కూర్చోగలరా?. ఈ టెక్నాలజీ టీడీపీనే కనిపెట్టిందేమో.
  3. స్టీల్ ప్లాంట్ కోసం 11 రోజుల దీక్ష నిర్వహించి..ఇప్పుడు వైజాగ్ రైల్వే జోన్ కోసం ఒక్క రోజు దీక్ష వెనక మతలబు ఏమిటి?.అంటే దీక్ష దీక్షకూ మోడల్ మారుతుందా?. ఇలా వింత వింత నిర్ణయాలతో చంద్రబాబు సర్కారు ప్రజల్లో పలుచన అవుతుంది. ఈ నిర్ణయాలు..ప్రభుత్వంలో జరిగే పరిణామాలు చూసి అధికారులు కూడా నవ్వుకుంటున్నారు. ఇవి చాలవన్నట్లు ‘ధర్మ పోరాటాలు’ అదనం.

Next Story
Share it