Telugu Gateway
Andhra Pradesh

వరదరాజులరెడ్డి వర్సెస్ సీఎం రమేష్

వరదరాజులరెడ్డి వర్సెస్ సీఎం రమేష్
X

కడప జిల్లాలో తెలుగుదేశం రాజకీయం హాట్ హాట్ గానే సాగుతోంది. ఎప్పటి నుంచే ఎంపీ సీఎం రమేష్, సీనియర్ నేత వరదరాజుల మధ్య వివాదాలు సాగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం వరదరాజుల రెడ్డి ప్రాజెక్టుల పేరుతో సీఎం రమేష్ భారీ ఎత్తున దోపిడీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది టీడీపీలో పెద్ద కలకలమే రేపింది. తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా వరదరాజుల రెడ్డి వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతే కానీ..అసలు కమిషన్ల విషయాన్ని మాత్రం కన్వీనెంట్ గా వదిలేశారు. అప్పటికి ఏదో సర్దుబాటు అయినట్లు కన్పించినా వరదరాజుల రెడ్డి మరోసారి సీఎం రమేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలతో కుమ్మక్కు అయి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రమేష్ ప్రొద్దుటూరు లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ తో కుమ్మక్కు అవుతున్నారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తన కుటుంబ సభ్యులను ప్రొద్దుటూరులో నిలబెట్టాలన్న ఆలోచనతోనే రమేష్ ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించాంరు. దీని వల్ల పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. వైఎస్సార్‌సీపీతో సంబంధాలను నెరుపుతూ పార్టీకి నష్టం చేస్తున్నారని తెలిపారు. సీఎం రమేష్‌ కాల్‌ డేటాను పరిశీలిస్తే స్థానిక వైఎస్సార్‌సీపీ నాయకులకు ఫోన్లు చేసిన విషయం బయటపడుతుందన్నారు. దమ్ము, ధైర్యముంటే కడప, పులివెందుల మున్సిపాలిటీల్లో రాజకీయాలు చేయాలని సవాల్‌ విసిరారు. గతంలో చెప్పినట్లు సీఎం రమేష్ గ్రామ రాజకీయాలకు ఎక్కువ, మండల రాజకీయాలకు తక్కువ అని ఎద్దేవా చేశారు.

Next Story
Share it