Telugu Gateway
Telangana

బంగారు బోనంతో సంతోషపర్చాలనుకోవటం మూర్ఖత్వమే

బంగారు బోనంతో సంతోషపర్చాలనుకోవటం మూర్ఖత్వమే
X

ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఈ సారి సంచలనాలకు కేంద్రంగా మారాయి. జోగిని శ్యామల ఆదివారం నాడు దేవాలయం వద్దే విలపిస్తూ..ఈ సర్కారు పడిపోతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ వ్యాఖ్యలు పెద్ద కలకలం రేపాయి. సోమవారం నాడు భవిష్యవాణి విన్పించిన స్వర్ణలత కూడా ఇంచుమించు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భవిష్యవాణి స్వర్ణలత వ్యాఖ్యలు ఆమె మాటల్లోనే...‘పుట్టెడు దుఃఖం తో భక్తులు నా దగ్గరికి వస్తున్నారు. బంగారు బోనం తో ఆనందపర్చడం అనుకున్నది మీ మూర్కత్వమే. నా బిడ్డలు ఆడపడుచులు చాలా కష్టాలు పడుతున్నారు. ఈ సంవత్సరం అంత ఆనంద పరిచే విధంగా ఏమీలేదు. నా భక్తులకు మీరు మంచి చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ కీడు ఎక్కువ చేస్తున్నారు. నా బిడ్డలను నేనే రక్షిస్తా ,అలాగే దుష్టులని శిక్షిస్తా...సమృద్ధిగా ఈ సారి వర్షాలు కురుస్తాయి.

పంటలు బాగా పండుతాయి. కుల మత బేధం లేకుండా నా దగ్గరికి వచ్చే భక్తులను సమానంగా ఆశీర్వదిస్తా. తప్పు చేసిన వారిని కచ్చితంగా శిక్షిస్తా. బంగారం బోనం కొంత సంతోషాన్ని..కొంత బాధను మిగిల్చింది. భక్తులను ఇబ్బంది పెట్టొద్దు. ఆడపడుచులు అందరూ దు:ఖంతో ఉన్నారు..ప్రజలంతా సంతోషంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. తర్వాత మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ మాట్లాడుతూ ఈసారి అమ్మవారికి బంగారు బోనం సమర్పించటం చారిత్రాత్మకం అన్నారు. వీఐపిల తాకిడి వల్ల భక్తులు కొంత ఇబ్బందిపడిన విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరికీ అమ్మవారి దర్శనం కల్పించామని తెలిపారు.

Next Story
Share it