Telugu Gateway
Andhra Pradesh

మంత్రి నారాయణ ‘కామెడీ’

మంత్రి నారాయణ ‘కామెడీ’
X

కోట్లాది రూపాయలు వెచ్చించి..కొత్త భవనాల్లోనూ వర్షం కురిపించే టెక్నాలజీ కనిపెట్టిన ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ సోమవారం నాడు కొత్త కామెడీని తెరపైకి తెచ్చారు. ‘మన రాష్ట్రంలో మనం బంద్ చేసుకుని మన ప్రజలను ఇబ్బంది పెడతామా’ అని ప్రశ్నిస్తున్నారు సదరు మంత్రి. వచ్చే ఎన్నికల్లోనే...లేకపోతే మరో ఐదేళ్ల తర్వాతో టీడీపీ ప్రతిపక్షంలోకి వచ్చి..ఏదైనా ప్రజా సమస్యలపై బంద్ చేయాల్సి వస్తే...నెల్లూరుకు పక్కనే ఉంది కదా అని పోయి తమిళనాడులో బంద్ చేస్తారా?లేక ఎంతైనా మన పాత రాష్ట్రమే కదా? అని తెలంగాణకు వస్తారా ఏంది బంద్ చేయటానికి . ఏ రాజకీయ పార్టీ అయినా పలు సమస్యలపై బంద్ లు చేయటం సహజమే. ఇలాంటి బంద్ లు ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం పార్టీ కూడా ఎన్నోసార్లు చేసింది.

గతంలో ఎన్నడూలేనట్లు సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మొదలుకుని..మంత్రులు, ఎంపీలు ధర్నాలు..దీక్షలు, ధర్మపోరాటాలు చేస్తే తప్పులేదు కానీ..ప్రతిపక్షాలు మాత్రం బంద్ లు చేయకూడదట. దానికి లాజిక్ ఏంటంటే సొంత రాష్ట్రంలో చేయకూడదట. మరి పక్క రాష్ట్రానికి పోయి చేస్తారా.. ఎవరైనా?. నిత్యం అధికార తెలుగుదేశం పార్టీనే ఏదో ఒక కార్యక్రమం పేరుతో విజయవాడ నడి వీధుల్లో హంగామా నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. కానీ మిగిలిన పార్టీలు మాత్రం ఏమీ చేయకూడదట. మంత్రి కామెడీని చూసి టీడీపీ నేతలే అవాక్కు అవుతున్నారు.

Next Story
Share it