Telugu Gateway
Cinema

అమర్..అక్బర్..అంటోని ‘సూపర్’

అమర్..అక్బర్..అంటోని ‘సూపర్’
X

అవును. ఈ సినిమా గురించి ఇదే మాట చెబుతున్నారు మ్యూజిక్ డైరక్టర్ తమన్. రవితేజ హీరోగా నటిస్తున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాలో రవితేజకు జోడీగా ఇలియానా నటిస్తోంది. చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా ఇలియానా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు చూశానని..సినిమా సూపర్ గా వచ్చిందని తమన్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రవితేజ ఈ సినిమాలో సూపర్ ఎనర్జీతో నటించారని పేర్కొన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. నేలటిక్కెట్ తర్వాత రవితేజ చేస్తున్న సినిమా ఇదే.

Next Story
Share it