అఖిల్ కు జోడీగా నిధి
BY Telugu Gateway18 July 2018 2:58 PM IST

X
Telugu Gateway18 July 2018 2:58 PM IST
అక్కినేని అఖిల్. టాలీవుడ్ లో కుదురుకునేందుకు కష్టపడుతున్న యువ హీరో. చేసిన సినిమాలు అన్నీ యావరేజ్ టాక్ తోనే ఉంటుండటంతో ‘సూపర్ హిట్’ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. నటనలో ఎంతో ఈజ్ ఉన్నా..పాటల్లో అలవోకగా డ్యాన్స్ లు చేసినా..సినిమా మాత్రం ఏదీ సూపర్ హిట్ అనేలా రావటం లేదు. ఇప్పుడు కెరీర్ లో మూడవ సినిమాకు రెడీ అవుతున్నాడు ఈ అక్కినేని హీరో.
ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా భాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ హీరోయిన్ నటించనుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. అంతే కాదు..ఈ సినిమాలో ‘ప్రత్యేక ఆకర్షణ’లు ఉండేలా చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు టాక్. ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో బాలీవుడ్ నటి ఫరా కరిమీ సందది చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇంగ్లాండ్లో జరుగుతోంది.
Next Story