Telugu Gateway
Andhra Pradesh

స్పీకర్ నిర్ణయంతో చిక్కుల్లో ‘వైసీపీ’

స్పీకర్ నిర్ణయంతో చిక్కుల్లో ‘వైసీపీ’
X

వైసీపీ చిక్కుల్లో పడింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్ణయంతో ఎంపీల రాజీనామాల వ్యవహారం పెండింగ్ లో పడిపోవటంతో రాజకీయంగా అది వైసీపీకి ఇబ్బందిగా మారే అవకాశం కన్పిస్తోంది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న పార్టీగా ఏపీ ప్రజల్లో ఇమేజ్ మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను గమనించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కసారిగా యూ టర్న్ తీసుకున్నారు. అంతకు ముందు అసలు ప్రత్యేక హోదాతో ఏమి వస్తుంది. నన్ను ఎడ్యుకేట్ చేయండి. హోదా కంటే ప్యాకేజీనే బెటర్ అంటూ పూటకో మాట్లాడి ప్రజల్లో పలుచన అయ్యారు చంద్రబాబు, టీడీపీ నేతలు. కారణాలు ఏవైనా తర్వాత చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. అసలు తానే హోదా చాంపియన్ అనేంతగా అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారు. తాజాగా వైసీపీ ఎంపీలు రెండుసార్లు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కలసి రాజీనామాలు ఆమోదించాలని కోరారు.

మళ్ళీ ఫ్రెష్ గా లెటర్స్ ఇస్తే వెంటనే ఆమోదిస్తామని ఆమె చెప్పారు. స్పీకర్ కోరినట్లే వైసీపీ ఎంపీలు మరోసారి లేఖలు ఇఛ్చారు. తర్వాత తమ రాజీనామాల ఆమోదం అయిపోయినట్లేనని..ఏ క్షణంలో అయినా నిర్ణయం వెలువడొచ్చని ప్రకటించారు. కానీ ఇది జరిగి పదిరోజులు దాటినా ఇంత వరకూ రాజీనామాల ఆమోదం అంశం ఎటూ తేలలేదు. ఓ వైపు అధికార టీడీపీ ఎంపీల రాజీనామాల విషయంలో ఎదురుదాడి చేస్తుంది. అంతా డ్రామా అంటూ విమర్శలు గుప్పిస్తోంది. స్పీకర్ వ్యవహార శైలి వైసీపీ ఎంపీలను కూడా విస్మయానికి గురిచేస్తోంది. అసలు ఏపీ విషయంలో బిజెపి వైఖరి ఏంటో అర్థం కాకుండా ఉందని వైసీపీ ఎంపీలు వ్యాఖ్యానిస్తుంటే వీరు ఎంత అనిశ్చితిలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ సంవత్సరాంతంలోనే ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతోంది ఈ తరుణంలో ఎంపీల రాజీనామాల ఆమోదం జాప్యం అయ్యే కొద్దీ అది వైసీపికి ఇరకాట పరిస్థితే.

Next Story
Share it