Telugu Gateway
Andhra Pradesh

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు
X

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రధాన ప్రతిపక్షానికి చెందిన ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. వీరి రాజీనామాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ గురువారం ఆమోదించారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎంపీలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామాలు ఆమోదించటంతో వైసీపీ ఎంపీలు ఇక ప్రజాక్షేత్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయనున్నట్లు ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ లోక్‌సభ సభ్యులు ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లోనే తమ రాజీనామాలను సమర్పించిన సంగతి తెలిసిందే. వాటిని ఆమోదిస్తూ లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ జూన్‌ 21న(గురువారం) తన నిర్ణయాన్ని వెల్లడించారు. ఒక రోజు ముందు నుంచే.. అంటే జూన్‌ 20(బుధవారం) నుంచే ఈ రాజీనామాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

ఎంపీల రాజీనామాల ఆమోదానికి ముందు స్పీకర్‌ ఒకటికి రెండుసార్లు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. స్పీకర్‌ వారం రోజులు జాప్యం చేయడంతో మళ్లీ జూన్‌ 6న వారు తమంతట తామే ఆమెను కలిసి రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టారు. వైసీపీ ఎంపీల రాజీనామాల విషయాన్ని లోక్‌సభ బులెటిన్‌ ద్వారా సెక్రటరీ జనరల్‌ స్నేహలతా శ్రీవాస్తవ వెల్లడించారు. నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, రాజంపేట ఎంపీ పీవీ మిథున్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి రాజీనామాలను ఆమోదించినట్టు విడివిడిగా ఉత్తర్వులను గురువారం బులెటిన్‌లో ప్రచురించారు.

Next Story
Share it