‘విజేత’ టీజర్ విడుదల

విజేత. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ ఫుల్ సినిమా టైటిల్. ఇప్పుడు అదే టైటిల్ ఆయన అల్లుడు వాడేస్తున్నాడు.సినిమా కూడా పూర్తి కావచ్చింది. ప్రమోషన్ లో భాగంగా ఇప్పుడు ఈ కొత్త విజేత సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో హీరోగా చేస్తున్నది మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ దేవ్. ఈ హీరో మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు (శ్రీజ భర్త) అన్న సంగతి తెలిసిందే. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వారాహి చలన చిత్రం బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కల్యాణ్ సరసన మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
తండ్రి కొడుకుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జూన్ 24న అభిమానుల సమక్షంలో ఆడియో వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలు హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. .జూలై మొదటి వారంలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
https://www.youtube.com/watch?v=gPT1ITXaqko