నిన్న క్యాస్టింగ్ కౌచ్...నేడు సెక్స్ స్కాండల్
టాలీవుడ్ కు వరస ఎదురుదెబ్బలు. నిన్న మొన్నటి వరకూ తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పెద్ద దుమారమే రేపింది. ఇది సద్దుమణుగుతున్న సమయంలో అమెరికాలో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతోంది. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహకుడు ఒకప్పడు సినీ రంగంలో సూపర్ హిట్లు ఇచ్చిన అతి పెద్ద నిర్మాత కార్యాలయంలో చాలా సంవత్సరాలు పనిచేసినట్లు గుర్తించారు. జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల క్రితం ప్రముఖ తెలుగు ఛానల్స్ ను టార్గెట్ చేసి మాట్లాడ బట్టి ప్రస్తుతం పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకుంది.. లేకపోతే ఆయా ఛానల్స్ రోజుల తరబడి ఇదే అంశంపై చర్చలు నిర్వహించి పరిశ్రమ పరువును బజారున పడేశారని ఓ పరిశ్రమ ప్రముఖడు వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ వ్యవహారం ఒకింత మేలు చేసిందని చెబుతున్నారు. సినీ పరిశ్రమలో అందరూ అలాంటి వారే ఉంటారని కాదు. కొంత మంది అలాంటి వారు ఉన్నారనేది కూడా ఎవరూ కాదనలేని వాస్తవం. తాజా వివాదం నుంచి ఎలా బయటపడాలనే అంశంపై మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అమెరికాలో ప్రముఖ తెలుగు సంఘాలు నిర్వహించే సదస్సులకు సినీ సెలబ్రిటీలను పిలవటం ఎప్పటి నుంచో ఉంది. ఆ సమయంలో ఇలాంటి లావాదేవీలు జరగటం కూడా కొత్తేమీ కాదని అమెరికాలో నివాసం ఉంటున్న ఓ పారిశ్రామికవేత్త తెలిపారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కొంత మంది వివరాలే అని..ఇలాంటివి ఎన్నో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ జాబితాలో కొంత మంది టాప్ హీరోయిన్లు కూడా ఉన్నారని...మిగిలిన ఆర్టిస్ట్ ల సంగతి అయితే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. అమెరికాలో సెక్స్ స్కాండల్ నిర్వహిస్తున్న కిషన్ చంద్ర దంపతులను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి స్వాదీనం చేసుకున్న పోన్ లు, ఇతర రికార్డులలో పలువురి పేర్లు ఉన్నాయని కనుగొన్నారు. అందులో ముగ్గురు ప్రముఖ హీరోయిన్లు కూడా ఉన్నారని సమాచారం. ఈ ముగ్గురు హీరోయిన్ లలో ఒకరు తెలుగులోని ప్రముఖ నటులతో నటించారని చెబుతున్నారు. మరో హీరోయిన్ ఇటీవల ప్లాప్ అయిన ఒక సినిమాలో నటించారట. మరో నటి కన్నడలో ప్రముఖంగా ఉన్నారని ప్రచారం.