Telugu Gateway
Cinema

సైరా...స్పీడ్ గా!

సైరా...స్పీడ్ గా!
X

చిరంజీవి రీ ఎంట్రీనే అదిరింది. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత సినిమాలు ఆపేసిన చిరు..రాజకీయాలకు గ్యాప్ ఇచ్చి మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే ‘ఖైదీ నైం150’. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో మళ్లీ సొంత బేనర్ లోనే చిరంజీవి, రామ్ చరణ్ కాంబినేషన్ లో ‘సైరా’ సరసింహరెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు స్పీడ్ గా సాగుతున్నాయి.. సాధ్యమైనంత వేగంగా సినిమాను పూర్తి చేసి..వచ్చే సమ్మర్ కు విడుదల చేయటం ద్వారా ఈ భారీ బడ్జెట్ సినిమాతో భారీ ఎత్తున ప్రయోజనం పొందేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

చారిత్రక కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చిరుతో పాటు బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌తో పాటు జగపతిబాబు, విజయ్‌ సేతుపతి, సుధీప్‌లు ఇ తరకీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను 2019 వేసవిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.

Next Story
Share it