Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ గురించి శ్రీరెడ్డి ఏమన్నారో తెలుసా?

ఎన్టీఆర్ గురించి శ్రీరెడ్డి ఏమన్నారో తెలుసా?
X

శ్రీరెడ్డి. ఈ మధ్య కాలంలో వివాదాలకు కేరాప్ అడ్రస్. ఆమె పేరు చెపితే ఏదో సంచలనమే అన్న చందంగా తయారైంది పరిస్థితి. కానీ ఎన్టీఆర్ విషయంలో మాత్రం ‘రివర్స్’ జరిగింది. శ్రీరెడ్డి తాజాగా జూనియర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టింది. అదేంటో మీరే చూడండి. ‘ టు దిస్‌ జనరేషన్‌ జూనియర్‌ ఎన్టీఆర్ ఈజ్‌ కింగ్‌ ఆఫ్‌ ఎ టాలీవుడ్‌. బిగ్‌బాస్‌కు ఎన్టీఆర్‌ సింహం’ అని తన పోస్టులో పేర్కొన్నారు. ‘జూనియర్‌ ఎన్టీఆర్‌ను బిగ్‌బాస్‌ షోలో అందరూ మిస్‌ అవుతున్నారు. ఎన్టీఆర్‌ స్థానాన్ని ఎవరూ రిప్లేస్‌ చేయలేరు.

అతని రాకతో ప్రజలు నిరాశలో ఉన్నారు. సాహో యంగ్‌ టైగర్‌’ అని తన ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారు. నానిపై ఆమె కొద్ది రోజుల క్రితం వివాదస్పద వ్యాఖ్యలు చేయటం..దీనికి నాని కూడా ఘాటుగా స్పందించటం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షో విషయంలో నాని, ఎన్టీఆర్ తో పోలుస్తూ పలు కామెంట్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. శ్రీరెడ్డికి నానితో ఉన్న విభేదాల కారణంగా ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటం సహజమే.

Next Story
Share it