Telugu Gateway
Telangana

కాంగ్రెస్ లో కాక పెంచుతున్న కోమటిరెడ్డి

కాంగ్రెస్ లో కాక పెంచుతున్న కోమటిరెడ్డి
X

కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో కాక పెంచే పనిలో ఉన్నారు. ఇప్పటికే శాసనసభాపక్ష నేత జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సరైన రీతిలో స్పందించాలన్నారు. హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేసిన ఆయన..తక్షణమే తమ సభ్యత్వాల పునరుద్ధరణ జరగకపోతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రెడీ కావాలన్నారు. ఉన్నది 15 మంది ఎమ్మెల్యేలమే కదా?. ఈ దిశగా జానారెడ్డి, ఉత్తమ్ స్పందించాలన్నారు. తాము ఏది చేసినా పార్టీ కోసమే చేశామని..గవర్నర్ ప్రసంగంలో ప్రజల అంశాలను విస్మరించారని విమర్శించారు. తమ సొంతం కోసం అయితే ఎవరి మద్దతు కోరమని..పార్టీ అంశం కాబట్టే ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి సాయం కోరాల్సి వస్తోందని అన్నారు. కర్ణాకటలోనూ..తెలంగాణలో న్యాయస్థానాలు ప్రజలకు నమ్మకం కలిగించాయని అన్నారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి కెసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే సభ్యత్వం పునరుద్ధరించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలి.

రాజ్యాంగం, న్యాయవ్యవస్థ మీద కేసీఆర్‌కు నమ్మకం లేదు. ఇలాంటి నియంత తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావటం దౌర్భాగ్యం అని వ్యాఖ్యానించారు. న్యాయ వ్యవస్థతో నాటకాలు ఆడుతున్నారు. ప్రజల్ని మోసం చేసినట్టు, న్యాయస్థానాన్ని కూడా మోసం చేస్తున్నారు. డబ్బుల కోసం పార్టీ మారిన ఎమ్మెల్యేలు పిటిషన్ వేశారు. కోర్టు ధిక్కార నోటీసులు ఇస్తాం. అసెంబ్లీ కార్యదర్శి.. సీఎస్‌లను కూడా బాధ్యులను చేస్తాం. సీఎం రాజీనామా చేసే పరిస్ధితి వస్తుంది. రేపటి లోపల మా సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి.’ అని ఆయన డిమాండ్ చేశారు. అయితే కోమటిరెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి స్పందించారు. ఎమ్మెల్యేలు అందరం రాజీనామా చేయాలనే చర్చ తమ వద్ద జరగలేదని..అధిష్టానం ఆదేశిస్తే ఆ పనిచేసే వాళ్లలో ముందు తానే ఉంటానని పేర్కొన్నారు.

Next Story
Share it