Telugu Gateway
Movie reviews

‘సమ్మోహనం’ మూవీ రివ్యూ

‘సమ్మోహనం’ మూవీ రివ్యూ
X

సినీ పరిశ్రమ అంటే ఏ మాత్రం ఇష్టం లేని పాత్రలో హీరో విజయ్(సుధీర్ బాబు) . సినిమాలు అంటే పిచ్చ ప్రేమ ఉండే వ్యక్తిగా హీరో తండ్రి నరేష్. ఓ అందమైన ఇంట్లో..అందమైన ఫ్యామిలీ. కానీ అకస్మాత్తుగా నరేష్ తన ఇంటిని ఓ సినిమా షూటింగ్ కోసం ఇస్తాడు. కండిషన్ ఏంటంటే షూటింగ్ కు ఇళ్లు ఇచ్చినందుకు నరేష్ కు ఆ సినిమాలో పాత్ర ఇవ్వాలి. ఇది విన్న విజయ్ చాలా సీరియస్ అవుతాడు. అయినా సరే నరేష్ కు ఛాన్స్ ఇస్తారు. షూటింగ్ మొదలవుతుంది. అందులో భాగంగానే ఆ ఇంట్లోకి సమీరా (అదితిరావు హైదరీ) ఎంట్రీ ఇస్తుంది. ఆ సినిమాలో హీరోయిన్ ఆమె. తెలుగు ఏ మాత్రం రాని సమీరా డైలాగులు చూసిన విజయ్ ఫ్యామిలీ నవ్వుకుంటుంది. ఇది గమనించిన సమీరా తనకు తెలుగు డైలాగులు నేర్పమని విజయ్ ను కోరుతుంది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆ క్రమంలో విజయ్ తన కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను కూడా ఆమెతో షేర్ చేసుకుంటాడు. అయితే ఆమె ఈ డైలాగులను తన సినిమాలో వాడేసుకుంటుంది. దీనికి జయ్ తీవ్ర ఆగ్రహానికి గురవుతాడు.

ఓ టీవీ చర్చలో పాల్గొన్న ఆమెను మారుపేరుతో ఈ అంశంపై ప్రశ్నిస్తాడు. సహజంగా అన్ని సినిమాల్లో లాగానే ఇందులోనూ కథ సుఖాంతం అవుతుంది. సమ్మోహనం సినిమా ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది. ముఖ్యంగా సినీ రంగానికి సంబంధించిన అంశాలపై పెట్టిన డైలాగులు పేలతాయి. అదే సమయంలో వెబ్ సైట్ల లో వచ్చే చెత్త వార్తల గురించి ఈ సినిమాలో పవర్ ఫుల్ పంచ్ లు వేశారు. ఫస్టాప్ లో నరేష్ పాత్ర హైలెట్ గా నిలుస్తుంది. సినిమా అంతా సినీ రంగం చుట్టూనే తిరుగుతుంది. సెకండాఫ్ కొత్త స్లో అయినట్లు అన్పించినా ఓకే. భావోద్వేగాలు కూడా బాగానే పండాయి. ఇక సినిమాలో హీరో సుధీర్ బాబు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు, హీరోయిన్ అదితిరావు హైదరీ కూడా మంచి నటన కనపరిచారు. దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఓ చిన్న సబ్జెక్ట్ ను తీసుకుని సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దటంలో సక్సెస్ అయ్యారు. నిజంగా ఈ సినిమా ‘సమ్మోహనమే’.

రేటింగ్. 3.25/5

Next Story
Share it