Telugu Gateway
Andhra Pradesh

తానాలో చిచ్చురేపిన ‘చికాగో సెక్స్ రాకెట్’!

తానాలో చిచ్చురేపిన ‘చికాగో సెక్స్ రాకెట్’!
X

అమెరికాలో వెలుగు చూసిన ‘చికాగో సెక్స్ రాకెట్’ అంశం ప్రతిష్టాత్మకమైన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో చిచ్చురేపుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు, టీడీపీ నేత వేమన సతీష్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని కోరుతూ కొంత మంది తానా సభ్యులు కమిటీకి ఈ మెయిల్స్ పంపుతున్నారు. తానా బోర్డు సభ్యులు కొంత మంది సైతం తాజా పరిణామాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చికాగోలో వెలుగుచూసిన సెక్స్ రాకెట్ కు సంబంధించి..ముఖ్యంగా కొంత మంది సినీ హీరోయిన్లు వీసాల కోసం ఉపయోగించిన లేఖల్లో తానావి చాలా ఉన్నాయి. ఈ అంశంపై నిగ్గు తేల్చేందుకే ప్రస్తుత తానా అధ్యక్షుడు వేమన సతీష్ ను హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించారు. ఇదే అంశం తానాలో కలకలం రేపుతోంది. ఈ అంశాలను ఉదహరిస్తూ తానా సభ్యులు కొంత మంది బోర్డు సభ్యులకు ఈ మెయిల్స్ పంపారు. సంబంధిత మెయిల్స్ లోని ముఖ్యాంశాలు కొన్ని...‘ సతీష్ వేమన గురించి మీకు కొత్తగా చెప్పాలిసిన పని లేదు, 2016, 2017 లోనే సతీష్ వేమన చేసిన పనులు, దొంగ ఓట్ల స్కాంలు, దానివల్ల తానా, తెలుగు వాళ్ళ పరువు రోడ్డు మీదకి వచ్చిపడిన తీరు వివరిస్తూ ఇంతకు ముందే సతీష్ వేమనని పదవి లో నుండి తొలగించవలసినదిగా కోరుతూ చేసిన విజ్ఞాపనలను మీరు పెడచెవిన పెట్టారు.

అతను చేసే ఆర్భాటాలకు తల ఒగ్గో..లేక మరేమీ కారణాల వల్లో కానీ మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఆయన గారు చేసిన పనుల వల్ల తన పరువు బజారు కి ఈడవడమే కాకా తానా వారు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఈ మధ్య మీడియా లో వచ్చే వరుస కధనాలు, సదరు సభ్యుడి పేరు ఉండడం వల్ల తానా పరువు మరింత దిగజారింది . బోర్డు సభ్యుల సమక్షం లో నే సతీష్ వేమన వాడే అసభ్య పదజాలం తెలుగు వాడి పరువును , తానా ప్రతిష్టను అంతర్జాతీయంగా దెబ్బతీస్తుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి సతీష్ వేమన ని ఆ పదవినుంచి తప్పించి మన తెలుగు వారి పరువును కాపాడండి , ఆలా చేయడం వలన మీ పెద్దరికాన్ని నిల్పుకున్నట్లు అవుతుంది. ఒక వేళ మీరు ఇంకా చర్య తీసుకొని పక్షంలో తామే ఈ సమస్యని మన తానా బోర్డు మరియు అందరి సభ్యుల ముందుకు తీసుకువచ్చి సతీష్ వేమన ని తొలగించాలా వద్ద అనే వోటింగ్ పెట్టి మెజారిటీ సభ్యుల మనసులోని భావాలని బయట పెట్టాల్సి వస్తుంది.

ఇంక అప్పుడు మీ పెద్దరికాన్ని కూడా సభ్యులు అగౌరవపరిచే పరిస్థితి వచ్చి , తానా పరువు చెయ్యి దాటిపోయే వరకి వేచి చూడకుండా తక్షణమే సరైన చర్యలు తీసుకొని సతీష్ వేమన ను పదవి నుండే కాక తానా సభ్యత్వం నుండి కూడా తొలగించి తెలుగు వాడి ఆత్మగౌరవం తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు నిలబెడుతారని భావిస్తున్నాను.’ అంటూ పేర్కొన్నారు. ఈ లేఖను కొంత మంది సభ్యులు డాక్టర్ జంపాల చౌదరికి పంపారు. ఇదిలా ఉంటే తానా కమిటీలో చాలా మంది సతీష్ వేమన సన్నిహితులే ఉన్నందున ఆయన్ను పదవి నుంచి తప్పించటం అంత తేలిగ్గా జరిగే పనికాదని తానాకు చెందిన కొంత మంది సభ్యులే చెబుతున్నారు. అసాధారణ పరిస్థితులు తలెత్తితే తప్ప..సతీష్ ను తప్పించటం అనేది జరగదన్నది కొంత మంది వాదన. అయితే చికాగో సెక్స్ రాకెట్ లో జరిగిన లావాదేవీల మొత్తం సుమారు 50 కోట్ల రూపాయల వరకూ ఉన్నందున త్వరలోనే ఈ కేసు ఎఫ్ బిఐకి వెళ్ళే అవకాశం ఉందని సమాచారం. అప్పుడు కొంత మంది మరింత చిక్కుల్లో పడటం ఖాయంగా కన్పిస్తోంది. చికాగో సెక్స్ రాకెట్ వ్యవహారం ప్రస్తుతం తానాను కుదిపేస్తోంది.

(ఈ ఐటెంలో పెట్టిన ఫోటోలో చంద్రబాబు, కోమటి జయరాంల మధ్య మోకాళ్లపై కూర్చున్న సతీష్ వేమన. పాత ఫోటో)

Next Story
Share it