Telugu Gateway
Cinema

రానా కంటికి శస్త్ర చికిత్స

రానా కంటికి శస్త్ర చికిత్స
X

టాలీవుడ్ లో విభిన్నమైన కథాంశాలతో కూడిన సినిమాల్లో చేస్తున్న వారిలో దగ్గుబాటి రానా ముందు వరసలో ఉంటారు. కేవలం హీరో పాత్రలే కాకుండా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలతోపాటు..పాత్ర బాగుంటే చాలు ఏదైనా అన్న ధోరణితో ముందుకెళతారు ఈ దగ్గుబాటి హీరో. రానాకు సంబంధించి సంచలనమైన సంగతి బయటపెట్టారు రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు. రానా త్వరలోనే తన కళ్ళకు శస్త్ర చికిత్స చేయించుకోనున్నారు. అయితే ఇది విదేశాల్లో జరగనుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో రానా తనకు ఓ కన్ను మాత్రమే కన్పిస్తుందని వెల్లడించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం కంటినొప్పి ఎక్కువగా ఉండటంతో షూటింగ్ లకు కూడా విరామం తీసుకుని..శస్త్రచికిత్సకు రెడీ అవుతున్నారు. అయితే ఈ చికిత్స ఏ దేశంలో చేయించుకోబుతున్నారనే విషయం మాత్రం ప్రకటించలేదు. రానా చేతిలో ప్రస్తుతం మూడు..నాలుగు సినిమాలు ఉన్నాయి. అయితే కంటి చికిత్స పూర్తయిన తర్వాతే తిరిగి రానా షూటింగ్ ల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Next Story
Share it