‘వైరస్’తో ముందుకు రానున్న వర్మ

అపజయాలు ఆయన్ను ఆపలేవు. సినిమా హిట్టా..ఫట్టా అన్నది ఆయనకు సంబంధం ఉండదు. తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటాడు. మిగిలిన దర్శకులు అయితే ఒక్క ఫ్లాప్ వస్తే కొత్త సినిమాలు కష్టం. అద్భుతమైన కథ వస్తే తప్ప వారి సినిమాను ఫాంలో ఉన్న ఓ హీరో కూడా అంగీకరించరు. వీటన్నింటికి వర్మ అతీతం. ఆయన తన పని తాను చేసుకుంటూ పోతూనే ఉంటారు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్త గా ‘వైరస్’ అంటూ కొత్త సినిమాను ప్రకటించాడు. రామ్ గోపాల్ వర్మ, నాగార్జునలు కలసి చేసిన ‘ఆఫీసర్’ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. దీన్ని ఏ మాత్రం పట్టించుకోని వర్మ కొత్త సినిమాకు రెడీ అయిపోయాడు.
అంతకు ముందు వర్మ దర్శకత్వంలో సర్కార్, ఎటాక్ ఆఫ్ 26/11 చిత్రాలను తెరకెక్కించిన పరాగ్ సంఘ్వీ కొత్త సినిమాను నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు. వైరస్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. సెంట్రల్ ఆఫ్రికాకు వెళ్లిన ఓ విద్యార్థి అరుదైన వైరస్ బారిన పడటం.. తరువాత ఆ విద్యార్ధి భారత్ తిరిగి వచ్చిన తరువాత భారీగా జరిగిన ప్రాణనష్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT