సంక్రాంతి బరిలో రామ్ చరణ్

సంక్రాంతి సీజన్ అంటే సినిమాలకూ సందడే. ప్రతిసారి ఈ సీజన్ లో అగ్రహీరోల సినిమాలు కూడా పందెం కోళ్ల తరహాలో పోటీపడతాయి. ఈ సారి మెగా హీరో రామ్ చరణ్ సంక్రాంతి బరిలో నిలవనున్నాడు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రామ్ చరణ్, కైరా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. భారీ చిత్రాల నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దానయ్య ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో వివేక్ ఒబేరాయ్ విలన్ రోల్‌లో నటిస్తుండగా, తమిళ నటుడు ప్రశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. తొలుత ఈ చిత్రం దసరాకే విడుదల చేయాలని నిర్ణయించినా..జాప్యం కానుంది. ప్రతి ఏటా సంక్రాంతి సీజన్ లో బాలకృష్ణ బరిలో ఉంటారు. మరి ఈ సారి కూడా ఆయన ఎన్టీఆర్ బయోపిక్ ను సంక్రాంతికే విడుదల చేస్తారా? లేక అంత కంటే ముందే వస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT