Telugu Gateway
Andhra Pradesh

పవన్...రోజూ ఈ లొల్లేంది...నువ్వే టీమ్ లు పెట్టుకో!

పవన్...రోజూ ఈ లొల్లేంది...నువ్వే టీమ్ లు పెట్టుకో!
X

పవన్ కళ్యాణ్. రోజూ ఏంటి ఇది. మాట్లాడితే నా నలభై ఏళ్ల అనుభవం ఇసుక దోపిడీకి ఉపయోగపడింది అంటావు. ఇది కరెక్ట్ కాదు. నేను రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కష్టపడుతుంటే..నాపై విమర్శలు చేస్తావా?. కావాలంటే మోడీని తిట్టు. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని వదిలేసి..ఏదో మా ఎమ్మెల్యేలకు తలా కొన్ని కోట్లు వచ్చే ఏర్పాట్లు చేస్తే దాన్ని కూడా ఓర్చుకోలేవా?. రోజూ ఏందీ లొల్లి. అక్రమ ఇసుక వ్యవహారం ఆపటం నా వల్ల కాదు. నీకు చేతనైతే టీమ్ లు పెట్టు. నీ టీమ్ లకు నేను సాయం చేస్తా. అంతే కానీ..నా అంతట నేను రంగంలోకి దిగి మా ఎమ్మెల్యేలకు ఉచితంగా కోట్ల రూపాయలు తెచ్చిపెడుతున్న స్కీమ్ ను ఆపమననటం ఏమైనా న్యాయమా?. అలాగని నాపై తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం బాగోదు. ‘మీ దగ్గర ఆ శక్తి ఉండి..మనుషులను పెట్టి ఎక్కడైనా ..ఎవరైనా తప్పు చేసిన వారిని ఎదిరిస్తే ..నేను సహకరిస్తా.. అంతే కానీ రాజకీయ చేయవద్దు.

అసలే నేను నీతివంతమైనన..సుపరిపాలన ఇస్తూ దేశంలోనే ఏపీని నెంబర్ గా మార్చుతుంటే అడ్డుకుంటావా?.’ అని చంద్రబాబు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేంటో...కొద్ది రోజుల క్రితం జరిగిన టీడీపీ ఎల్పీ సమావేశంలో ఇసుక దందాలో ఎమ్మెల్యేలు ఉంటే సహించేదిలేదని..అక్రమ ఇసుక వ్యవహారానికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. మరి అసలు ఎమ్మెల్యేలు..టీడీపీ నేతలు ఎవరూ ఈ వ్యాపారంలో లేకపోతే చంద్రబాబు ఈ హెచ్చరిక ఎందుకు చేసినట్లో ఆయనకే తెలియాలి. అసలు పవన్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవటంలో వచ్చిన పొరపాటు వల్లే ఈ సమస్యలు అన్నీ. చంద్రబాబు ఉచిత ఇసుక అన్ని చెప్పింది ఎమ్మెల్యేలకే...ప్రజలకు కాదు. అందుకే పవన్ కళ్యాణ్ రోజూ పొరపాటు పడి చంద్రబాబును విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఎక్కడైనా ఉచిత ఇసుక వంటి కీలక పథకం ప్రకటించి అందరికీ అందుబాటులే ఉండేలా చూస్తుందా? లేక టీమ్ లు పెట్టుకోండి..ఎవరైనా అడ్డం వస్తే నాకు చెప్పండి అంటే అది జరిగే పనేనా?. ఇసుక కావాల్సిన వారంతా ముఖ్యమంత్రి దగ్గరకు రాగలరా?. అది సాద్యమయ్యే పనేనా?.

Next Story
Share it