బెదిరిస్తున్న ‘నిత్యామీనన్’
BY Telugu Gateway25 Jun 2018 9:49 AM IST
X
Telugu Gateway25 Jun 2018 9:49 AM IST
నిత్యామీనన్. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలే చేస్తూ దూసుకెళుతున్న నటి. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలే కాదు..ఇలా కూడా చేయోచ్చు అంటూ తనదైన శైలిలో సినిమాలను ఎంపిక చేసుకుంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకుంది ఈ భామ. ఇప్పుడు ఓ సినిమా ద్వారా బెదిరించేందుకు రెడీ అయింది. ఈ ఫస్ట్ లుక్ చూసిన వారెవరైనా..నిత్యమీనన్ ఇలా ఉంది ఏంటి అనుకోవటం ఖాయం. ‘ప్రాణ’ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇది.
ఈ సినిమాను ఏకంగా తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నది వీ కె ప్రకాష్. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ ఓ చిన్న పాత్రను పోషిస్తున్నారు. సినిమాకు సంబంధిచిన ఫస్ట్ లుక్ ను కూడా ఆయనే విడుదల చేశారు. గతంలో ఎన్నడూ చూడని రీతిలో ఈ సినిమా ఫస్ట్ లుక్ డిఫరెంట్ స్టైల్ లో ఉంది.
Next Story