ఏంటీ..చూస్తే షాకవుతారు..షేక్ అవుతారు..

ఇదీ నిహారిక సీరియస్ వార్నింగ్. ఎవరికి అనుకుంటున్నారా?. మీ పెళ్లెప్పుడు..సోషల్ మీడియాలో ఏవేవో వార్తలు వస్తున్నాయి కదా?. అని ఓ విలేకరి అడిగిన వెంటనే నిహారిక నుంచి వచ్చిన రియాక్షన్ ఇది. వాస్తవానికి ఇది నిజం కాదు. అంతా సినిమా ప్రమోషన్ లో భాగంగా చేసిందే. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియోను యూవీ క్రియేషన్స్ యూట్యూబ్‌లో షేర్ చేసింది. అందులో నీహారిక సీరియస్ రియాక్షన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ‘ మేడమ్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాం.. మీ వెడ్డింగ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దీనిపై ఏమైనా చెబుతారా అని అడగగా.. నిహారిక సీరియస్ గా రియాక్ట్ అవుతూ . ‘అసలు ఎవరు నిన్ను లోనికి రానిచ్చింది. నా పెళ్లి గురించి మీకెందుకయ్యా.. నిహారిక ఎవర్ని చేసుకుంటుంది, ఎప్పుడు చేసుకుంటుంది,ఎందుకు చేసుకుంటుంది.. చూస్తే షాక్ అవుతారు.. షేక్ అవుతారు.. కిందపడి లేస్తారు.. పిచ్చా మీకేమైనా.. మీ థంబ్ నెయిల్స్ కోసం నన్ను వాడుకుంటారా’ అంటూ అతనిపై విరుచుకుపతుంది.
తర్వాత అతగాడు మేము అడుగుతుంది మీ హ్యాపి వెడ్డింగ్ మూవీ గురించి మేడమ్ అని చెప్పగా.. నిహారిక వెంటనే కూల్ గా సారీ చెప్పారు. ఆమె మాట్లాడుతూ.. హ్యాపి వెడ్డింగ్ ట్రైలర్ జూన్ 30న రిలీజ్ కాబోతుందన్నారు. అప్పుడు సినిమా రిలీజ్ ఎప్పుడో చెబుతామంటూ.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. హ్యాపి వెడ్డింగ్ చిత్ర ప్రమోషన్ కోసం రూపొందించిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రంలో సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా నటించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను శనివారం ఉదయం 10.35 గంటలకు విడుదల కానుంది.
https://www.youtube.com/watch?v=f_bc7-AlSQo