మెహరీన్ కూ అమెరికాలో చేదు అనుభవం

మెహరీన్. టాలీవుడ్ లో మెరిసిన భామ. కృష్ణగాడి వీరప్రేమగాధ సినిమాతో ఎంట్రీ ఇఛ్చిన ఈ హీరోయిన్ తెలుగులోనూ తళుక్కున మెరుస్తూనే ఉంది. తాజాగా టాలీవుడ్ పరిశ్రమ సెక్స్ రాకెట్ విమర్శలు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రభావం ఏ మాత్రం సంబంధం లేని వారిపై కూడా పడటం విషాదం. సరిగ్గా హీరోయిన్ మెహరీన్ కు కూడా అమెరికాలో ఇదే అనుభవం ఎదురైంది. అదీ విమానాశ్రయంలో. కేవలం టాలీవుడ్ నుంచి వచ్చిన కారణంగానే ఆమెను అమెరికా విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు.
అమెరికాలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ఇద్దరిని ఫెడరల్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మెహరీన్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు దాదాపు అరగంట పాటు విచారించి తర్వాత వదిలేశారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించింది. తనను సెక్స్ రాకెట్ కు సంబంధించిన ప్రశ్నలు అడగటంతో తాను అవాక్కు అయినట్లు ఆమె వెల్లడించారు. వాళ్లు ఈ విషయం ప్రస్తావించే వరకూ అక్కడ ఏమి జరిగిందో తనకు తెలియదన్నారు. అమెరికాకు వచ్చే ప్రతి టాలీవుడ్ నటిని విచారిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ అధికారులు తెలిపారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కెసీఆర్ పెద్ద పరీక్షే పెట్టుకున్నారు..అందులో విజయం సాధ్యమా?!
2 July 2022 12:50 PM GMTస్పైస్ జెట్ విమానంలో పొగ..ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
2 July 2022 5:36 AM GMTఆవో-దేఖో-సీకో
1 July 2022 3:17 PM GMTనుపుర్ శర్మపై సుప్రీం ఫైర్
1 July 2022 6:58 AM GMTఏపీలో సర్కారు వారి 'సినిమా ఆగింది'
1 July 2022 6:24 AM GMT
ప్రేమలేఖలు అందాయన్న శరద్ పవార్
1 July 2022 6:05 AM GMTఫడ్నవీస్ కు అధిష్టానం షాక్..డిప్యూటీ సీఎం పదవి
30 Jun 2022 2:04 PM GMTవ్యూహాం మార్చిన బిజెపి..శివసేనను పూర్తిగా ఖతం చేసేందుకేనా!
30 Jun 2022 12:27 PM GMTముంబయ్ చేరుకున్న ఏక్ నాథ్ షిండే
30 Jun 2022 9:42 AM GMTసంజయ్ రౌత్ కు ఈడీ నోటీసులు
27 Jun 2022 12:15 PM GMT