కొత్త లుక్ లో మహేష్ బాబు
మహేష్ బాబు ఈ మధ్యే ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ప్రయోగాలు చేయటానికి రెడీగా లేను అని. వరస పెట్టి తిన్న దెబ్బలతో కాస్త ఇబ్బంది పడే ఈ స్టేట్ మెంట్ ఇచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ మహేష్ బాబును తిరిగి గాడిలో పెట్టింది. ఈ సినిమా సూపర్ హిట్ కావటంతో మహేష్ బాబు లో ధైర్యం వచ్చింది. ఇప్పుడు తన కొత్త సినిమా కోసం కొత్త లుక్ తో ట్రై చేయనున్నాడు. తొలిసారి మహేష్ బాబు మీసాలు..గడ్డంతో కన్పించబోతున్నాడు. విమానాశ్రయంలో ఇదే లుక్ తో మహేష్ బాబు వీడియోకు చిక్కాడు.
దీంతో ఇదే మహేష్ బాబు కొత్త లుక్ అనే ప్రచారం జరుగుతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చేయనున్నారు మహేష్. గతం ఎన్నడూ లుక్ విషయంలో ప్రయోగాలు చేయని మహేష్ తొలిసారిగా డిఫరెంట్ లుక్ లో కనిపిస్తుండటంతో వంశీ పైడిపల్లి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడనున్నాయి. మహేష్ 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని అశ్వనీదత్, దిల్ రాజులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.