మోడీ..కుమారస్వామి ‘పొలిటికల్ ఫిట్ నెస్ ఛాలెంజ్’
ఈ మధ్య సెలబ్రిటీల బజ్ వర్డ్ ‘ఫిట్ నెస్ ఛాలెంజ్’. క్రికెటర్లు..మంత్రులు..సెలబ్రిటీలు అందరూ ఈ ఛాలెంజ్ ప్రారంభించారు. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కూడా తన ఫిట్ నెస్ కు సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. అంతే కాదు..ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామికి ఫిట్ నెస్ ఛాలెంజ్ విసిరారు. ఈ ఛాలెంజ్ పై కుమారస్వామి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ లో భాగంగా తనకు ప్రధాని మోదీ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విసరడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు కర్ణాటక సీఎం కార్యాలయం ద్వారా తెలిపారు.
తన ఆరోగ్యంపై మోదీ శ్రద్ధ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఫిజికల్ ఫిట్‌నెస్ అనేది ఎవరికైనా ముఖ్యమే. అందుకే ప్రతిఒక్కరూ ఎక్సర్‌సైజ్, యోగా, జిమ్ లాంటి ఏదో రకంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటారని పేర్కొన్నారు. తాను కూడా రోజూ ట్రెడ్‌మిల్‌పై వర్కవుట్స్, యోగా చేస్తానని కుమారస్వామి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి గురించి అంతకుమించి ఆందోళన చెందుతున్నానని, అందుకు మీ మద్దతు కావాలంటూ మోడీని ఫిక్స్ చేసే ప్రయత్నం చేశారు కర్ణాటక సీఎం కుమారస్వామి.