Top
Telugu Gateway

తెరపై ముద్దులకు నో అంటున్న హీరోయిన్

తెరపై  ముద్దులకు నో అంటున్న హీరోయిన్
X

కీర్తి సురేష్. ఎప్పుడూ హద్దులు దాటకుండా వెండితెరపై మెరుస్తుంది. నటించటం అంటే..కేవలం ఎక్స్ పోజింగ్ మాత్రమే కాదు అని నమ్మే హీరోయిన్లలో ఆమె ఒకరు. అందుకే పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించినా ఇంత వరకూ ఎక్కడా ఓవరాక్షన్ చేయలేదు. కాకపోతే అజ్ణాతవాసి సినిమాలోనే కీర్తి సురేష్ పాత్ర ఆమెను అభిమానించే వారికి కూడా చికాకు తెప్పించిందనే చెప్పొచ్చు. అది మినహా కీర్తి సురేష్ చేసిన ‘నేను శైలజ’,నేను లోకల్ చిత్రాల్లో చాలా హుందగా కన్పించారు. ఇక సావిత్రి జీవిత చరిత్ర ‘మహానటి’ సినిమాతో అయితే కీర్తి సురేష్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. బహుశా ఇది ఆమె లైఫ్ టైమ్ బెస్ట్ మూవీ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క సినిమాతో నిజంగానే కీర్తి సురేష్ నటనకు మంచి గుర్తింపు దక్కింది.

అజ్ణాతవాసి తప్ప..తెలుగులో ఆమె చేసిన సినిమాలు అన్నీ సూపర్ హిట్టే. అయినా కూడా తన పాత బాటను వీడనంటోంది. తాను ఎప్పటిలాగానే భవిష్యత్ లోనూ ‘ముద్దు సీన్ల’లో నటించనని తేల్చిచెబుతోంది. ఎందుకంటే తెరపై రొమాన్స్ కు తాను సెట్ కానని చెబుతోంది. కథలు ఎంచుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటానని కీర్తి సురేష్ చెబుతోంది. అయితే ఈ మధ్య కాలంలో వస్తున్న హీరోయిన్లు ఎవరూ కూడా కీర్తి సురేష్ లాగా ముద్దులకు ఆంక్షలు పెట్టేవారు లేరనే చెప్పుకోవచ్చు. ఏ వైపు టాలీవుడ్ తో పాటు పలు పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వస్తున్న ఈ తరుణంలో కూడా ‘ముద్దు సీన్ల’కు నో అని చెప్పే హీరోయిన్లు ఉన్నారంటే నిజంగా కీర్తి సురేష్ గ్రేట్.

Next Story
Share it