Telugu Gateway
Andhra Pradesh

బిజెపి ఓ దొంగల పార్టీ

బిజెపి ఓ దొంగల పార్టీ
X

ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో తెలుసా?. ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. అంతే కాదు..ఆయన ప్రధాని మోడీ, అమిత్ షా అధ్యక్షుడు అమిత్ షాలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోదీ కన్నా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే సీనియర్‌ అన్నారు. గత నాలుగేళ్లు దొంగల పార్టీతో కలిసి పనిచేశామంటూ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. దొంగల పార్టీ (బీజేపీ)తో కలిసి నాలుగేళ్లు పనిచేస్తే ఏపీకి మట్టి ముద్ద తప్ప ఏమీ ఇవ్వలేదని విమర్శించారు.

ప్రధాని మోదీకి, బీజేపీ జాతీయధ్యక్షుడు అమిత్‌ షాలకు పనికిమాలిన నాయకులే కావాలి తప్ప చంద్రబాబు లాంటి నాయకుడు అవసరం లేదని అభిప్రాయపడ్డారు. బీజేపీ అంటేనే ప్రజలు తరిమికొట్టే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయన్నారు. మోదీకన్నా సీనియర్‌ నేత ఒక్క చంద్రబాబు మాత్రమేనని, ఏపీ ముఖ్యమంత్రికి చాలా అనుభవం ఉందంటూ కొనియాడారు. ప్రజల మధ్య మీటింగ్స్‌ పెట్టి గట్టిగా మాట్లాడితే ప్రజలు తంతారనే భయం బీజేపీ నేతలకు పట్టుకుందని కళా వెంకట్రావ్‌ చెప్పారు.

Next Story
Share it