Telugu Gateway
Cinema

ఎన్టీఆర్ కొత్త సినిమాకు ఏర్పాట్లు

ఎన్టీఆర్ కొత్త సినిమాకు ఏర్పాట్లు
X

ఓ వైపు ఎన్టీఆర్ ఓ సినిమా షూటింగ్ లో ఉండగానే..మరో సినిమాకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. అయితే ఇది ఒక్క ఎన్టీఆర్ సినిమానే కాదు. ఇందులో మరో హీరో రామ్ చరణ్ కూడా ఉన్నారు. ఇద్దరు యంగ్ హీరోలతో మల్టీస్టారర్ అంటే దానిపై ఎంత క్రేజ్ ఉంటుందో అంచనా వేయటం కూడా కష్టమే. అంతే కాదు..వీరిద్దరిని డైరక్ట్ చేసేది బాహుబలి వంటి సినిమాను అందించిన దర్శకుడు రాజమౌళి కావటంతో ఇది మరింత పీక్ కు చేరటం ఖాయం. గత కొన్ని నెలలుగా ఈ మల్టీస్టారర్ సినిమా స్క్రిప్ట్ పనిలో బిజీగా ఉన్న రాజమౌళి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు అవసరమైన సెట్స్ వేయించే పనిలో ఉన్నారని టాక్.

ఈ సినిమా షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. బాహుబలి సినిమాకు ఆర్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన సాబు సిరిల్‌ ఈ చిత్రానికి కూడా పని చేయనున్నారు. ఆయన సారధ్యంలోనే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ భారీ సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ సెట్‌లో యాక్షన్‌ సీన్స్‌ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరించనున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అరవింద సమేత, రామ్‌ చరణ్‌, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రాలు పూర్తయిన వెంటనే రాజమౌళి మల్టీస్టారర్‌ సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.

Next Story
Share it