Telugu Gateway
Andhra Pradesh

సతీష్ వేమన..కోమటి జయరాం..గంగాధర్ లకు అమెరికాలో సమన్లు!

సతీష్ వేమన..కోమటి జయరాం..గంగాధర్ లకు  అమెరికాలో సమన్లు!
X

అమెరికా తెలుగుదేశం ఆత్మరక్షణలో పడబోతుందా?. అవుననే అంటున్నాయి అమెరికాలోని తానా వర్గాలు. టీడీపీ కీలక నేతగా ఉన్న సతీష్ వేమన, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న కోమటి జయరాం, గంగాధర్ లకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికారులు నోటీసులు (సబ్ పినో) జారీ చేశారు. ఈ వార్త ఇప్పుడు అమెరికాలోని తానా వర్గాల్లో కలకలం రేపుతోంది. అసలు సబ్ పినో (subpoena) అంటే ఏమిటంటే ఏదైనా విచారణకు ఆదేశించే ముందు, శిక్ష ఖరారు చేయటానికి ముందు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను పరిశీలించటం. ఇఫ్పటికే ఈ ముగ్గురికి సబ్ పినో జారీ చేసినట్లు తానా వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం గత ఏడు సంవత్సరాలుగా సతీష్ వేమన, కోమటి జయరాం, గంగాధర్ లు నిర్వహించిన అన్ని లావాదేవీలను హోంల్యాండ్ సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ చేయనున్నారు. ఇందులో వ్యక్తిగత ఈ మెయిల్స్ తోపాటు బ్యాంకు లావాదేవీలు కూడా ఉంటాయి.

అదే సమయంలో క్రెడిట్ కార్డ్స్/డెబిట్ కార్డ్స్ వాడటం ద్వారా ఎవరెవరికి టిక్కెట్లు కొనుగోలు చేశారు. దేశీయ, అంతర్జాతీయ పర్యటనల కోసం. వీరి కార్డుల ద్వారా ఎవరెవరికి అమెరికాలో హోటల్ రూమ్స్ బుక్ చేశారు. ఇతర లావాదేవీలు ఏమిటి?. చికాగోలో వెలుగు చూసిన సెక్స్ రాకెట్ వ్యవహారంతో వీరిపై హోంల్యాండ్ సెక్యూరిటీ దృష్టి సారించి నోటీసులు జారీ చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కొంత మంది హీరోయిన్లను..రాజకీయ నేతలను అమెరికా తీసుకెళ్లటంలో వీరు కీలకపాత్ర పోషించారని ప్రచారం జరుగుతోంది. హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు బ్యాంకు లావాదేవీలతోపాటు ఫ్లైట్ టిక్కెట్స్, హోటల్ బుకింగ్స్ అన్నీ వెలికి తీస్తుండటంతో ఎవరెవరి జాతకాలు బయటపడతాయో అన్న ఆందోళన తానా వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఇప్పటికే సబ్ పీనో అందుకున్న వారిలో ఒకరు లండన్ వెళ్లిపోయినట్లు తానా వర్గాలు చెబుతున్నాయి. ఏడేళ్ల కు సంబంధించి వీరి ముగ్గురి వివరాలు వెలికితీస్తే చాలా సమాచారం బయటకు వస్తుందని చెబుతున్నారు. అందులో కొంత మంది మంత్రులు..కీలక నేతలు, సినీ రంగానికి చెందిన వారు కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. సతీష్ వేమన, కోమటి జయరాంలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులు అన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే. తానా డాక్యుమెంట్లను కొంత మంది ఫోర్జరీ చేసి అమెరికా వీసాలు పొందటానికి వాడుకున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రస్తుత తానా అధ్యక్షుడు సతీష్ వేమన ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it